కోదాడ, జనవరి 26 : కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చింతల వీరయ్య స్నేహశీలి అని, అందరినీ ఆప్యాయంగా పలకరించే వారు అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందిన చింతల వీరయ్య అంత్యక్రియలో ఆయన పాల్గొని పాడె మోశారు. దశాబ్ద కాలంగా వీరయ్య కుటుంబంతో తనకు అవ్యాజానుబంధం ఉందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. అంత్యక్రియల్లో పలు పార్టీల నాయకులు పారసీతయ గట్ల కోటేశ్వరరావు, రఘు, వెంపటి మధు, తొగరు రమేష్, చల్లా ప్రకాష్, రషీద్, రామయ్య పాల్గొన్నారు.

Kodada : స్నేహశీలి చింతల వీరయ్య : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్