నీలగిరి, జూన్ 11 : నల్లగొండ పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని కాలనీల్లో ర్యాలీలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అనంతరం సూపర్వైజర్లు మాట్లాడుతూ మూడేండ్లు నిండిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని సూచించారు.
చిన్నారుల్లో జ్ఞాపకశక్తి పెంపొందించేందుకు వారితో అక్షరాలను సులభంగా గుర్తుపట్టేలా విద్యను ఆట పాటలతో నేర్పించనున్నట్లు తెలిపారు. అంతేగాక చిన్నారులు రక్తహీనత, పౌష్టికాహారం లోపం అధిగమించేందుకు ప్రతిరోజు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు పార్వతి, జయమ్మ, లక్ష్మమ్మ, వినోదకుమారి, సరస్వతి, అంగన్వాడీ టీచర్లు సరిత, రజిత, రజియా సుల్తానా, గుత్త జ్యోతి, కవిత, ఆయాలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Nilagiri : ‘చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలి’