కట్టంగూర్, ఏప్రిల్ 23 : బాల్య వివాహాలను ఆరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ బూరుగు శారదారాణి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చిన్న వయస్సులో వివాహాలు చేయడం వల్ల ఆడపిల్లలు అనారోగ్యానికి గురైతారని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు చేయాలని సూచించారు. బాల్య వివాహాలు చేయడం వల్ల కలిగే నష్టాలను ఈ సందర్భంగా వివరించారు. అనంతరం బాల్య వివాహ విముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేసి పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్, పూజారి యుగేందర్ శర్మ, కో ఆర్టినేటర్ శోభారాణి, ఝాన్సీ, అశ్రీత, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.