రామగిరి, జూన్ 7: చేపల పండుగగా నిర్వహించే మృగశిర కార్తె రానే వచ్చిం ది. ప్రతిఏటా జూన్లో వచ్చే ఈ పం డుగ సందర్భంగా చేపలకు విపరీతమై న డిమాండ్ ఉంటుంది. మృగశిర కార్తె చేపలు తినడమనేది ఆనాదిగా వస్తున్నది. రోహిణి కార్తెలో రోకళ్లు పగిలే ఎండల నుంచి చల్లటి వాతావరణంలోకి తీసుకెళ్లే శుభదినం కూడా నేటి నుంచి ప్రారంభంకానున్నది.
చేపలకు భలే గిరాకీ…
వాతావరణంలో మార్పుల వల్ల ప్రజ లు అనారోగ్యాలకు గురవుతారు. పిల్ల లు, వృద్ధులు ఉబ్బసం తదితర వ్యా ధులతో ఇబ్బందులు పడతారు. రోగ నిరోధక శక్తి కోసం చేపలు, నాటుకో ళ్లను తింటారు. శాకాహారులు ఇంగు వ, బెల్లం కలిపి ఉండలుగా చేసుకొని తిం టే జీర్ణవ్యవస్థ మెరుగుపడి రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఈ కార్తె రోజు చేప లు ఎక్కువకు విక్రయిస్తున్నారు.