నార్కట్పల్లి, జూన్ 09 : నార్కట్పల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ పనుల్లో చేపట్టిన బిల్లులను అడిషనల్ డీఆర్డీఓ నవీన్ సోమవారం తనిఖీ చేశారు. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి మండల వ్యాప్తంగా 154 పనులు చేపట్టారు. రూ.4 కోట్ల 10 లక్షలు ఖర్చు చేశారు. రూ.21 లక్షల సామగ్రి కొనుగోలు చేశారు. సామాజిక బృందం వారు 10 రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి ఉపాది పనుల అమలు తీరుపై సమీక్షించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఉపాది పనులను సక్రమంగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లుకు తావివ్వకూడదని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీవీఓ వేణుగోపాల్, ఏవీఓ గౌతమి, ఎంపీడీఓ ఉమేశ్, ఎంపీఓ సుధాకర్, ఏపీఓ యాదయ్య, పంచాయితీ కార్యదర్శులు, క్లస్టర్లు పాల్గొన్నారు.