మఠంపల్లి, డిసెంబర్ 10 : స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్న సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీని వీడి పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మఠంపల్లి మండలం చన్నాయపాలెంకి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ భుక్య జ్యోతి అశోక్ ఆధ్వర్యంలో బుధవారం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బానోతు అలీ నాయక్, భూక్య శివనాయక్, బానోత్ కృష్ణ నాయక్, బానోతు నాగేశ్వరరావు, బానోతు బాలు నాయక్, బానోతు నాగు నాయక్ తదితరులు పాల్గొన్నారు.