కట్టంగూర్, మే 07 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని సీఐటీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ అన్నారు. కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో బుధవారం మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక జెండా ఎగురవేసి ఆయన మాట్లాడారు. పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకోవడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమిది గంటల పని దినాలను 12 గంటలకు పెంచి కార్మికుల చట్టాలను తుంగలో తొక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఐటీయూ నిరంతరం కార్మిక, ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పెంజర్ల సైదులు, పాన్న అంజయ్య, మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మురారి మోహన్, వెంకన్న, తవిటి వెంకటమ్మ, కాసర్ల స్వప్న, గుడుగుంట్ల రామకృష్ణ, పున్న ఆగయ్య, కర్నాటి రాములు, చింత భిక్షం, విజయలక్ష్మి, భాగ్యరేక, లింగయ్య పాల్గొన్నారు.