కోదాడ, అక్టోబర్ 14 : క్రీడల్లో రాణించి కోదాడ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకు రావాలని ఎల్డర్స్ రిక్రియేషన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఏటుకూరి రామారావు, పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ జాస్తి సుబ్బారావు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలో గల ఎల్డర్స్ రిక్రియేషన్ సొసైటీ ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల కోసం ఆధునిక టెక్నాలజీతో సొసైటీ నిధులు రూ.3.50 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను వారు ప్రారంభించి మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా కోదాడలో తాము దాతల సహకారంతో ఇండోర్ స్టేడియం నిర్మాణం చేసేందుకు ఎంతగానో కృషి చేశామని, క్రీడాకారులు స్టేడియంలో శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి కోదాడ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఆవుల రామారావు, రామినేని శ్రీనివాసరావు, కోశాధికారి తోట రంగారావు, బీసీ మెంబర్స్ సురేష్ రెడ్డి, శ్రీధర్, క్రీడాకారులు పాల్గొన్నారు.