కొండమల్లేపల్లి, జూన్ 17 : చిన్నారుల ఉజ్వల భవిష్యత్‌కు అంగాన్వాడీ కేంద్రాలే పునాదులని సీడీపీవో ఖాతిజ, ఏసీడీపీవో సరళ అన్నారు. మంగళవారం మండలంలోని గుమ్మడవెల్లిలో అమ్మమాట అంగన్వాడీ బాట నిర్వహించారు. పౌష్టికాహారంపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో అంగాన్వాడీ సూపర్వైజర్ వరలక్ష్మి, టీచర్ అరుందతి, ఆయా సుమతి పాల్గొన్నారు.
మునుగోడు, జూన్ 17: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు విద్యాబుద్ధులు నేర్పిస్తారని సీడీపీవో లావణ్యకుమారి అన్నారు. మండలంలోని చీకటిమామిడి అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం అమ్మమాట-అంగన్వాడీ బాటలో చిన్నారులకు అక్షరాభాస్యం చేయించారు. చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శివేశ, అంగన్వాడీ టీచర్లు విజయ, శోభ, రజిని పాల్గొన్నారు.
చిట్యాల,జూన్ 17 : మండలంలోని పలు గ్రామాల్లో అమ్మమాట అంగన్వాడీ బాట నిర్వహించారు. బొంగోని చెరువు, వెల్మినేడు, ఆరెగూడెం, ఉరుమడ్లలో పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. వెల్మినేడు అంగన్వాడీ పిల్లలకు అంతటి పారిజాత నర్సింహ పలకలు, బైకాని మాధవి శ్రీశైలం ప్రీ స్కూల్ మెటీరియల్ పంపిణీ చేశారు. కార్యక్రమాలలో వెల్మినేడులో పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి, ధనలక్ష్మి, పారిజాత, వాణి, రేవతి, చంద్రకళ, యాదమ్మ, రేణుక, ఆండాలు, పద్మ, నవనీత, కవిత, జ్యోతి, గంట ధనమ్మ, అంజమ్మ, లలిత, బుచ్చమ్మ పాల్గొన్నారు.
వేములపల్లి, జూన్ 17: ఐదేండ్లలోపు పిల్లలను రోజూ అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని సూపర్వైజర్ పరిమి రజిని అన్నారు. మంగళవారం మండలంలోని రావులపెంట అంగన్వాడీ కేంద్రం-3లో అమ్మమాట.. అంగన్వాడీ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఈవో లక్ష్మణ్‌నాయక్, మాజీ ఎంపీటీసీ నంద్యాల శ్రీరాంరెడ్డి, పురాణం సైదులు, ఓరుగంటి రమేశ్, అంగన్వాడీ టీచర్లు శారద, వెంకటరమణ, విజయ, ఏఎన్ఎం నిర్మల, ఆశా వర్కర్లు కవిత, సైదమ్మ, పద్మ, ఆయాలు సక్కుబాయి, అనిత తదితరులు పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి జూన్ 17: మండలంలోని ఎల్లారెడ్డిగూడెం అంగన్వాడీ-1 కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బాటను మంగళవారం నిర్వహించారు. బాలింతలకు, గర్భిణులకు పోషక ఆహారంపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
అడవిదేవులపల్లి, జూన్ 17: ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా మండలంలోని ఉల్సాయిపాలెం అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం సూపర్వైజర్ సీహెచ్ నాగరాణి చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరినీ అంగన్వాడీలకు పంపించాలని కోరారు. అంగన్వాడీ టీచర్లు శోభా, రమాదేవి, మణెమ్మ పాల్గొన్నారు.
త్రిపురారం, జూన్ 17: ఆటపాటలతో విద్య, బిడ్డల ఎదుగుదలకు పౌష్టికాహారం అంగన్వాడితోనే సాధ్యమని సీడీపీవో చంద్రకళ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం-1లో అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. తహసీల్దార్ గాజుల ప్రమీల మాట్లాడుతూ పిల్లలకు క్రమశిక్షణతో కూడా విద్యను అందించాలన్నారు. ఎంపీడీవో కునిరెడ్డి విజయకుమారి మాట్లాడుతూ చిన్నారులను అంగన్వాడీల్లో చేర్పించాలని కోరారు. అంగన్వాడీ సూపర్వైజర్ మల్లేశ్వరి, ఎంఈవో రవినాయక్, అంగన్వాడీ టీచర్లు నేతి శైలజ, మంగమ్మ, సరిత, ఎల్లేశ్వరి, పర్వీన్ పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్,జూన్ 17: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు విద్యాబుద్దులతో పాటు బాలింతలకు, గర్భిణులకు పరిపూర్ణ పౌష్టికాహారం అందుతుందని రాములబండ ఐసీడీఏస్ సూపర్వైజర్ పద్మ అన్నారు. నల్లగొండ మండలంలోని చెన్నుగూడెం, కూధావన్పూర్లో మంగళవారం అమ్మమాట-అంగన్వాడీ బాటలో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు శశికళ, ఆండాలు పాల్గొన్నారు.
త్రిపురారం, జూన్ 17: మండలంలోని సత్యనారాయణపురం అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం సూపర్వైజర్ విజయలక్ష్మీ చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అంగన్వాడీలో చిన్నారులతోపాటు గర్భిణులు, బాలింతలు పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శ్రావణి, ఆమని, పద్మ పాల్గొన్నారు.
మిర్యాలగూడటౌన్, జూన్ 17: మిర్యాలగూడ అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధి ఇస్లాంపుర సెక్టార్‌లోని కలాల్‌వాడ, సుందర్‌నగర్ అంగన్వాడీ కేంద్రాల్లో అమ్మమాట అంగన్వాడీబాటలో సూపర్వైజర్ నాగమణి ఆధ్వర్యంలో మంగళవారం సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అంగన్వాడీ టీచర్లు లక్షి, పద్మజాదేవి, ఆయాలు వెంకటమ్మ, నాగమణి పాల్గొన్నారు.
చందంపేట, జూన్ 17 : మండలంలోని కంబాలపల్లి సెక్టార్ పరిధి చిత్రియాల అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం అమ్మమాట అంగన్వాడీ బాట నిర్వహించారు. ఐసీడీఎస్ డీడబ్ల్యూ కృష్ణవేణి ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో దేవరకొండ సీడీపీవో చంద్రకళ, సూపర్వైజర్ సుశీల, ఉపాధ్యాయలు గోవిందమ్మ, శారద, రాధిక, మంజుల, శ్రీదేవి, అలివేలు పాల్గొన్నారు.