ఆత్మకూర్.ఎస్, మార్చి 24 : సీసీ కెమెరాలు మూడో నేత్రంగ పనిచేస్తాయని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల ఎస్ఐ బి.శ్రీకాంత్ గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన 2002-03 పదో తరగతి విద్యార్థులు పాఠశాలకు నాలుగు సీసీ కెమెరాలు బహూకరించగా ఎస్ఐ సోమవారం వాటిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలు దేవాలయాలతో సమానమన్నారు. అయితే ఇటీవల కొందరు అసాంఘిక కార్యక్రమాలకు పాఠశాలలను వాడుతున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. సీసీ కెమెరాలతో పాఠశాలలో జరిగే అసంఘిక కార్యక్రమాలు వెంటనే తెలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రావణ్ కుమార్, పూర్వ విద్యార్థులు చిత్తలూరి వెంకన్న, దాసరి మాల్సూర్, చల్లా శ్రీనివాస్‌రెడ్డి, గునిగంటి అంజయ్య, బట్టిపల్లి వెంకన్న, కిరణ్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.