సమయానికి సేవలందేలా.. హృద్రోగులకు భారం తప్పేలా
హృద్రోగులకు వరంగా మారింది ఉస్మానియా జనరల్ వైద్యశాలలోని క్యాథల్యాబ్. గతంలో ఈ ల్యాబ్ లేకపోవడంతో ఉస్మానియాకు వచ్చే రోగులు కొన్ని రకాల గుండె పరీక్షలు, ప్రొసీజర్స్ కోసం బయట ల్యాబ్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది.
- వరంగా మారుతున్న ఉస్మానియా క్యాథల్యాబ్
- మూడు నెలల్లో 12,740మందికి ఓపీ సేవలు
- 8,777 మందికి గుండె పరీక్షలు, చికిత్స
సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ) : హృద్రోగులకు వరంగా మారింది ఉస్మానియా జనరల్ వైద్యశాలలోని క్యాథల్యాబ్. గతంలో ఈ ల్యాబ్ లేకపోవడంతో ఉస్మానియాకు వచ్చే రోగులు కొన్ని రకాల గుండె పరీక్షలు, ప్రొసీజర్స్ కోసం బయట ల్యాబ్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. సాధారణంగా గుండె సంబంధిత పరీక్షలు, చికిత్స ఖరీదైనవి కావడంతో నిరుపేద హృద్రోగులకు ఆర్థిక భారం తప్పేది కాదు. దీనిని గమనించిన తెలంగాణ సర్కార్ ఏడాదిన్నర క్రితం రూ.7 కోట్లతో ఉస్మానియా దవాఖానలో కొత్తగా క్యాథలాబ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కార్పొరేట్ తరహాలో ఏర్పాటు చేసిన ఈ క్యాథలాబ్ ద్వారా నిరుపేదల హృద్రోగులకు ఖరీదైన వైద్య సేవలను పైసా ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా అందిస్తున్నారు ఉస్మానియా వైద్యులు. సాధారణంగా గుండె సంబంధ వ్యాధులతో బాధపడే హృద్రోగులకు క్యాథల్యాబ్ ద్వారా పలు రకాల పరీక్షలు నిర్వహిస్తారు. వాటి నివేదికల ఆధారంగానే చికిత్స చేయాల్సి ఉంటుంది. గతంలో క్యాథల్యాబ్ లేకపోవడంతో ఉస్మానియాకు వచ్చే హృద్రోగులు సంబంధిత వైద్యపరీక్షల కోసం ప్రైవేటు బాట పట్టాల్సి వచ్చేది. ఉస్మానియాలో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాథలాబ్తో పేదలకు ఆర్థిక భారం తప్పడమే కాకుండా సకాలంలో చికిత్స అందుతుండడంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడగలుగుతున్నామంటున్నారు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్. గడిచిన మూడు నెలల్లో 12,740మందికి ఓపీ సేవలు అందించగా వారిలో 8777 మందికి పలు రకాల గుండె పరీక్షలు జరిపి, అవసరమైన చికిత్స అందించినట్లు తెలిపారు.
8,777 మందికి ప్రొసీజర్స్
కార్పొరేట్‌కు దీటుగా సేవలందిస్తున్న ఉస్మానియా క్యాథల్యాబ్కు నిరుపేదలు క్యూ కడుతున్నారు. ఖరీదైన వైద్యపరీక్షలతో పాటు మెరుగైన చికిత్స పూర్తి ఉచితంగా లభిస్తుండడంతో తెలుగు రాష్ర్టాల నుండే కాకుండా పొరుగు రాష్ర్టాలైన కర్నాటక, మహారాష్ట్రతో పాటు బిహార్, యూపీ రాష్ర్టాలకు చెందిన రోగులు సైతం ఇక్కడ చికిత్స పొందుతున్నట్లు సూపరింటెండెంట్ డా.నాగేందర్ తెలిపారు. గడిచిన మూడు నెలల్లో 362 ఆంజియోగ్రామ్స్, 184 పీటీసీఏలు, 8231 2డీ-ఈకో చేశామని, మొత్తం 8777మందికి ఈ క్యాథలాబ్ ద్వారా గుండెకు సంబంధించిన పలురకాల ప్రొసీజర్స్, పరీక్షలు జరిపి చికిత్స అందించినట్లు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

