మునుగోడు, ఏప్రిల్ 02 : రేషన్ బియ్యంను కిరాణా దుకాణదారులు కొనడం, అమ్మడం నేరం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ అన్నారు. గురువారం మునుగోడులో పలు కిరాణా దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కిరాణా దుకాణాల్లో రేషన్ బియ్యం దందా చేస్తే, ఆయా దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరిoచారు. “రేషన్” దందా చేసే అలవాటు ఉన్న వాళ్ల ఇకపై..”మేము రేషన్ బియ్యం కొనము,అమ్మం” అని బోర్డు పెట్టేలా చూస్తామన్నారు. కిరాణ షాపుల్లో రేషన్ బియ్యంను కొని అమ్ముతున్నారని ఫిర్యాదులు వస్తున్న దరిమిలా ఇకపై తరచుగా తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.