నల్లగొండ, జనవరి 30 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ డిమాండ్ చేశారు. బీబీనగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలపై ప్రశ్నించిన సందీప్‌రెడ్డిపై దాడి చేయించడంతోపాటు కేసీఆర్, కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట మంత్రి కోమటిరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ 14ఏండ్లు అనేక పోరాటాలు చేసి.. కేసులు, జైలు జీవితం అనుభవించి స్వరాష్టం సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మాట్లాడే నైతిక హకు కోమటిరెడ్డికి లేదన్నారు.
ఆనాడు వ్యక్తిగత కాంట్రాక్టుల కోసం మంత్రి పదవికి రాజీనామా డ్రామా ఆడి దొంగ దీక్ష చేపట్టిన చరిత్ర కోమటిరెడ్డిదని మండిపడ్డారు. రైతుబంధుపై మాట్లాడిన సందీప్‌రెడ్డిని వ్యక్తిగతంగా దూషిస్తూ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డికి కోమటిరెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకకైనా తన తీరును మార్చుకొని ప్రజాప్రతినిధులను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. లేదంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు నోముల శంకర్ యాదవ్, బాషబోయిన లింగస్వామి, క్రాంతికుమార్, గంట కిరణ్, గణేశ్, శ్రీకాంత్, నానియాదవ్, శివకుమార్, సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు.