కోదాడ, మే 11 : కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని పాత పోస్ట్ ఆఫీస్ స్థలంలో కొత్త పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణం చేపట్టాలని పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణ సాధన కమిటీ సభ్యులు సోమవారం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఎమ్మెల్యే స్పందిస్తూ స్థలంలో పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. విజ్ఞాపన పత్రం అందజేసిన వారిలో ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు, సాధన కమిటీ కన్వీనర్ గంధం బంగారు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రెడ్డి, సాధన కమిటీ సభ్యులు రాయపూడి చిన్ని, ముత్తవరపు రామారావు, కుదరవెల్లి బసవయ్య, ఉప్పగండ్ల సరోజ పాల్గొన్నారు.