భువనగిరి అర్బన్, ఏప్రిల్ 12 : వరంగల్ జిల్లాలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఈ నెల 14న రాయగిరి నుంచి యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం వరకు నిర్వహించే పాదయాత్ర పోస్టర్‌ను భువనగిరి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ఒగ్గు శివకుమార్, జిల్లా కో ఆర్డినేటర్ దేవరపల్లి ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ పాదయాత్రకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతోపాటు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు హాజరవుతారని తెలిపారు. పాదయాత్రలో జిల్లా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ భువనగిరి నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎండీ మున్నా, ఏర్పుల అరవింద్, ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి రకాల రమేశ్, భువనగిరి, బీబీనగర్ మండలాల అధ్యక్షులు కనకాల మహేశ్, పచ్చిమట్ల వంశీగౌడ్, నాయకులు కిరణ్, సాయికుమార్, మహేశ్, సతీశ్, శ్రావణ్, పవన్, నర్సింహ, వంశీ పాల్గొన్నారు.