పాలకవీడు, సెప్టెంబర్ 13: కమీషన్ల కోసమే జాన్‌పహాడ్ లిఫ్ట్ అంచనా వ్యయం పెంచారని హుజూర్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్‌లో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రూ.173 కోట్ల వ్యయంతో జాన్‌పహాడ్ లిఫ్ట్ పనులను ప్రారంభించి 70శాతం పూర్తి చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ పనులు నిలిపివేశారన్నారు. సంవత్సరం తర్వాత లిఫ్ట్ పనుల అంచనా వ్యయాన్ని రూ. 302 కోట్లకు పెంచి జనాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఆయకట్టు పరిధి పెంచకుండా కమీషన్ల కోసం మాత్రమే అంచనా వ్యయాన్ని పెంచారని, దీనిపై మంత్రి ఉత్తమ్ ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. నియోజకవర్గంలో రైతులు వ్యవసా య పనులు వదిలి యూరియా కోసం పీఏస్సీఎస్ కార్యాలయాల వద్ద గోస పడుతుంటే మంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
మం త్రి సొంత నియోజకవర్గంలో బస్తా యూరియా 600 నుంచి 650 వరకు బ్లాకులో విక్రయిస్తున్నారని, దీని ద్వారా కూ డా మంత్రికి కమీషన్లు వస్తున్నాయని ఆరోపించారు. మిర్యాలగూడ ఎమ్మె ల్యే గన్‌మెన్ లారీ లోడు యూరియా ను అమ్ముకొన్నట్లు తేలడంతో జిల్లా ఎస్పీ విధుల నుంచి తొలగించి విచారణ చేపడితే, మంత్రి ఉత్తమ్ పీఏలు, డ్రైవర్లు కూడా 10 లోడ్ల యూరియా అమ్ముకున్నారని, వారి సలహా మేరకే తాను కూడా ఒక లోడు యూరియా ను పక్కదారిపట్టించానని పోలీసుల విచారణలో చెప్పిన ట్లు తమకు పూర్తి సమాచారం ఉందన్నారు. మంత్రి ఉత్తమ్ పీఏలు, డ్రైవర్లపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మండల అధ్యక్షుడు కిష్టిపాటి అంజిరెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ యరెడ్ల సత్యనారాయణరెడ్డి, నియోజకవర్గ నాయకులు కేఎల్ఎన్రెడ్డి, చెన్నబోయిన సైదులు, ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు రామారావు, పార్టీ మం డల అధికార ప్రతినిధి పసుపులేటి సైదులు, నాయకులు లక్ష్మారెడ్డి, దాదేఖాన్, లక్ష్మీనారాయణ, సత్యనారాయణరెడ్డి, సైదిరెడ్డి, వెంకటేశ్వర్లు, జానిరెడ్డి, సతీష్, ఇంద్రారెడ్డి తదిత రులు పాల్గొన్నారు.