నకిరేకల్ అభివృద్ధికి బీఆర్ఎస్ కృషి
బీఆర్ఎస్ హయాంలో రూ.67.60 కోట్లతో నకిరేకల్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని, పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయిన 100 పడకల దవాఖాన నిర్మించామని, పట్టణాభివృద్ధికి మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, కౌన్సిలర్ల కృషి ఎనలేనిదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొనియాడారు.
- పట్టణాభివృద్ధి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల కృషి ఎనలేనిది
- 100 పడకల దవాఖాన ఏర్పాటుతో నెరవేరిన చిరకాల వాంఛ
- నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్, మే 6: బీఆర్ఎస్ హయాంలో రూ.67.60 కోట్లతో నకిరేకల్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని, పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయిన 100 పడకల దవాఖాన నిర్మించామని, పట్టణాభివృద్ధికి మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, కౌన్సిలర్ల కృషి ఎనలేనిదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొనియాడారు. నకిరేకల్ మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో మంగళవారం నకిరేకల్‌లోని సువర్ణగార్డెన్ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ చైర్మన్, రాచకొండ శ్రీనివాస్, కౌన్సిలర్లు పల్లె విజయ్, చింతా స్వాతీ త్రిమూర్తులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా లింగయ్య మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సహకారంతో నకిరేకల్‌లో రూ.32 కోట్లతో 100 పడకల దవాఖాన నిర్మించామన్నారు. అలాగే రూ.26 కోట్లతో పద్మానగర్ బైపాస్ నుంచి ఇనుపాముల బైపాస్ వరకూ 4 కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణం చేపట్టామని, రూ.20 కోట్ల తో పట్టణంలోని 20 వార్డుల్లో అంతర్గత సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టామని, రూ.2 కోట్లతో నకిరేకల్ మెయిన్ సెం టర్ నుంచి చీమలగడ్డ ఫ్లైఓవర్ వరకూ సీసీ రోడ్డు నిర్మాణాలు చేపట్టామన్నారు. పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంలో చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్ల కృషి ఎనలేనిదని కొనియాడారు. ప్రజలకు చేసిన సేవ ఎప్పటికీ నిలిచిపోతుందని, మంచి పనులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. ప్రజల ఆశీర్వాదం తో భవిష్యత్‌లో ప్రజలకు మరింత సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు. పదవీకాలం ముగిసినా, ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేయాలన్నారు.
కార్యక్రమంలో మన్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు పల్లె విజయ్, చింతా స్వాతీత్రిమూర్తులు, నకిరేకల్, కట్టంగూర్ మాజీ జడ్పీటీసీలు మాద ధనలక్ష్మీనగేశ్, తరాల బలరాం, తాటికల్ సర్పంచి బంటు రవి, నకిరేకల్, కేతేపల్లి బీఆర్ఎస్ మం డల అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, ఉపాధ్యక్షుడు గుండగోని జంగయ్య, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు పేర్ల కృష్ణ కాంత్, సీనియర్ నాయకులు సోమ యాదగిరి, పెం డెం సదానందం, సామ శ్రీనివాస్‌రెడ్డి, యానా ల లింగారెడ్డి, గుర్రం గణేశ్, కొండ వినయ్, ఎండీ అఖిల్, బీమనబోయిన ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

