త్రిపురారం, జూలై 14 : ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా త్రిపురారం మండల మాజీ అధ్యక్షుడు అనుముల శ్రీనివాస్‌రెడ్డి, ఇన్చార్జి అధ్యక్షుడు పామోజు వెంకటాచారి అన్నారు. సోమవారం మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామంలో అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే అంశంపై విస్తృతంగా పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, రైతుబీమా, రైతు భరోసాపై ప్రజలు, రైతులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారని ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై వారు స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేంతవరకు ప్రజలకు అండగా ఉంటామని హామి ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా అధికారులతో మాట్లాడడం జరుగుతుందని, లేనిపక్షంలో ఉన్నతాధికారులకు వినతిపత్రం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిడమనూరు మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ కామెర్ల జానయ్య, పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ గుండెబోయిన వెంకన్నయాదవ్, రైతుబంధు మాజీ డైరెక్టర్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, బైరం కృష్ణ, కలకొండ వెంకటేశ్వర్లు, మజ్జిగపు వెంకట్‌రెడ్డి, జంగిలి శ్రీనివాస్, దైద రవి, కృష్ణ, చందునాయక్ పాల్గొన్నారు.
Tripuraram : ప్రజలకు అండగా బీఆర్ఎస్ : శ్రీనివాస్‌రెడ్డి