చండూరు, ఏప్రిల్ 20 : ఈ నెల 27న వరంగ్‌లోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభా స్థలాన్ని ఆదివారం మండలానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ సభకు వచ్చే కార్యకర్తలు. ప్రజలు, అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎత్తపు మధుసూదన్‌రావు, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, మాజీ జడ్పీటీసీ అన్నేపర్తి సంతోష శేఖర్, యువజన విభాగం అధ్యక్షుడు ఉజ్జిని అనిల్‌రావు, అధికార ప్రతినిధి బొడ్డు సతీశ్‌గౌడ్, కూసుకుంట్ల యువసేన నియోజకవర్గ అధ్యక్షుడు నక్క సుధీర్ పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : ఈ నెల 27 వరంగల్ నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో అదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు. సమావేశంలో జిల్లా నాయకులు నోముల క్రాంతి, ప్రెమ్ కుమార్, గంట కిరణ్, నవీన్, నాగరాజు, సాయి, సంజయ్, రాజు, శివ, నాని పాల్గొన్నారు.
గుర్రంపోడ్ : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కేసీఆర్ సైనికులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని పార్టీ మండలాధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంతో పాటు ఆమలూరు, బొల్లారం, నడికూడ, కొప్పోలు, వెంకటాపురం, కొయగూరోనిబావి, వట్టికోడు, చేపూర్, మొసంగి, చామలోనిబావి, పిట్టలగూడెం, తేనేపల్లి గ్రామాల్లో ఆదివారం ఈ మేరకు పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఎలతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే సభకు ప్రతి గ్రామం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. కార్యక్రమాల్లో ఏపీసీఎస్ వైస్ చైర్మన్ పామనగుండ్ల వెంకన్న, నాయకులు నాగులవంచ నాగేశ్వర్రావు, కేసాని వెంకట్‌రెడ్డి, కామళ్ల ్లరాములు, మేకల వెంకట్‌రెడ్డి, కూనూరు సైదిరెడ్డి, షేక్ సిరాజ్, మేడి లింగయ్య, వనమాల మహేందర్, కుందారపు యాదగిరి, అనిల్‌రావు, గోన లింగారావు, మారేపల్లి రామకృష్ణ, బొల్లంపల్లి శ్రీకాంత్, కలారి లింగస్వామి పాల్గొన్నారు.