అనంతగిరి, ఏప్రిల్ 19 : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలాధ్యక్షుడు నల్లా భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో పార్టీ రజితోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సభకు పార్టీ శ్రేణులు సైనికుల్లా కదిలి రావాలని కోరారు. ఈ నెల 27న గ్రామ గ్రామాన పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం ర్యాలీగా కార్యకర్తలు, పార్టీ అభిమానులు మండల కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. సమావేశంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు అఫ్జల్, నాయకులు ఏడుకొండలు, పందిరి వీరయ్య, వెంకటప్పయ్య, వెంకటేశ్వర్లు, భూక్యా బోసు, నాగేశ్వరరావు, శ్రీనివాస్, చార్లెస్ పాల్గొన్నారు.