భువనగిరి కలెక్టరేట్, డిసెంబర్ 18: బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన భువనగిరి మండలం హనుమపురం గ్రామ సర్పంచ్ నాగపురి సువర్ణ కృష్ణ గురువారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరడాన్ని పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ప్రజల మద్దతుతో ఎన్నికైన ప్రజా ప్రతినిధి పార్టీ మారడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు, స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. ఇకనైనా ఎమ్మెల్యే అనిల్‌కుమార్ రెడ్డి స్వార్థ రాజకీయాలు మానుకుని ప్రజాసేవ చే యాలని వారు డిమాండ్ చేశారు.