నకిరేకల్, నవంబర్ 14 : బీఆర్ఎస్ నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్యను గెలుపును కాంక్షిస్తూ, ఎమ్మెల్యే చిరుమర్తికి మద్దతుగా మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు చిట్యాలలో మంగళవారం రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్, వివిధ గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీగా భారీగా తరలివెళ్లారు. వెళ్లిన వారిలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్, పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల, పట్టణాధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, యల్లపురెడ్డి సైదిరెడ్డి, ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు పాల్గొన్నారు.
కట్టంగూర్ నుంచి..
కట్టంగూర్: మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి పెద్దఎత్తున చిట్యాలకు వెళ్లారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి నుంచి..
నార్కట్‌పల్లి: మండలంలోని వివిధ గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైక్‌ల పై తరలి వెళ్లారు. ఆ ర్యాలీని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అమ్మనబోలు నుంచి బైక్‌పై ర్యాలీగా చిట్యాలకు బయల్దేరి వెళ్లారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేతేపల్లి నుంచి..
కేతేపల్లి: మండలంలోని వివిధ గ్రామాల నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల నుంచి డీసీఎం, కార్లలో తరలివెళ్లారు. తరలిన వారిలో పార్టీ మండలాధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మారం వెంకట్‌రెడ్డి, చిముట వెంకన్నయాదవ్, జడ్పీటీసీ బొప్పని స్వర్ణలత, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, నాయకులు బి.శ్రీనివాస్ యాదవ్, చల్లా కృష్ణారెడ్డి, బచ్చు జానకీరాములు, గోలి వేణుమాధవరెడ్డి, బంటు మహేందర్, కె.శ్రవణ్, డి.సుధాకర్, కె.సైదులు గౌడ్, తండు రాములుగౌడ్ ఉన్నారు.