పట్టభద్రులూ ఆలోచించి ఓటెయ్యండి
ఖమ్మ- వరంగల్-నల్లగొండ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పట్టభద్రులందరూ ఆలోచించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆ మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్ కోరారు.
- రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించండి
- బీఆర్ఎస్ కొండమల్లేపల్లి మండలాధ్యక్షుడు దస్రూనాయక్
కొండమల్లేపల్లి, మే 26 : ఖమ్మ- వరంగల్-నల్లగొండ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పట్టభద్రులందరూ ఆలోచించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆ మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్ కోరారు. అదివారం మండల కేంద్రం లో విలేకరులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కసారి ఓటేసినందుకే రాష్ర్టాన్ని కాంగ్రెసోళ్లు ఆగం చేస్తున్నారని, మళ్లీ వారికి అవకాశం ఇవ్వొద్దన్నారు.
విదేశాల్లో ఉన్నత ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేయడానికి వచ్చిన రాకేశ్‌రెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని, ఆయనను గెలిపిస్తే నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తారన్నారు. సామన్య కుటుంబం నుంచి వచ్చిన రాకేశ్‌రెడ్డిని గెలిపిస్తే పెద్దల సభలో ప్రశ్నించే గొంతుకగా వ్యవహరిస్తూ పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు రమావత్ తులసీరాం నాయక్, గండబోయిన లింగం యాదవ్, పెద్దిశెట్టి సత్యం, రావుల వెంకటయ్య, దాచేపల్లి నరేందర్, వరికుప్పల పాండు, తోటపల్లి శ్రీను, బోడగిరి, ముడావత్ పాండు, గోవింద్‌నాయక్, పి.ఏరుకొండ లక్ష్మయ్య, యాదయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

