పెన్‌పహాడ్, అక్టోబర్ 25 : హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతు పార్టీ పెన్‌పహాడ్ మండల నాయకులు శనివారం జూబ్లీహిల్స్‌లోని రెహమత్ నగర్లో ప్రచారం నిర్వహించారు. మాజీ ఎంపీపీ నెమ్మది భిక్షం, చిదెళ్ల సింగిల్ విండో చైర్మన్ వెన్న సీతారాం రెడ్డి క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరుగుతూ సునీతను గెలిపించాల్సిందిగా కోరుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెమ్మది కృష్ణ, కీర్తి వెంకట్రారావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.