మోటకొండూర్, నవంబర్ 2: సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ఆదరించి.. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఆరెగూడెం, గిరబోయినగూడెం, మేడికుంటపల్లి, దిలావర్పూర్, ఇక్కుర్తి, మాటూరు, పెద్దబావి, చాకంపల్లి, అమ్మనబోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు అలోచన చేసి ఓటు వేయాలని కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే చీకటి రాజ్యం వస్తుందని చెప్పారు. గతంలో అన్నమో రామచంద్రా అన్న పట్టించుకొని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు బీఆర్ఎస్ పథకాల అమలుపై, సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దేశం గర్వపడేలా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు గుర్తుచేశారు.
బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను గ్రామగ్రామాన ప్రజలకు వివరించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసిందో ప్రజలు నిలదీయాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. రైతులకు రైతు బంధు బిచ్చం అని రేవంత్‌రెడ్డి ఎగతాళి చేస్తున్నాడని, రైతులు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని సూచించారు. రైతు బంధుతో ప్రజాధనం వృథా అని అనేందుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సిగ్గుండాలన్నారు. ఎంపీగా కాంగ్రెస్ నేత కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని గెలిపించాక గ్రామాలకు వచ్చడా అని ప్రశ్నించారు.
అనంతరం వివిధ పార్టీలను చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో నార్మూల్ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేశ్‌గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎగ్గిడి బాలయ్య, బీఆర్ఎస్వై నేతలు గొంగిడి అభిషేక్‌రెడ్డి, చామల ఉదయ్‌చందర్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు దూదిపాల రవీందర్‌రెడ్డి, సర్పంచులు చామకూర అమరేందర్‌రెడ్డి, పన్నాల బాయమ్మ, పోతిరెడ్డి స్వప్న, నర్మద, కో ఆప్షన్ సభ్యుడు బురాన్, ఎంపీటీసీలు పన్నాల అంజిరెడ్డి, జ్యోతిలక్ష్మి, నాయకులు భూమండ్ల అయిలయ్య, బైరోజు వెంకటాచారి, ఎగ్గిడి కృష్ణ, కృష్ణంరాజు, ఎర్ర మల్లేశ్, పన్నాల నవీన్‌రెడ్డి, పైళ్ల పాండురంగారెడ్డి, నర్సింహులుయాదవ్, వెంకటేశ్, నాయకులు పాల్గొన్నారు.