నాంపల్లి, నవంబర్ 24 : ప్రతిపక్ష నాయకులు ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది బీఆర్ఎస్సే అని మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని గానుగుపల్లి, మహ్మదాపురం, గట్ల మల్లేపల్లి, తుమ్మలపల్లి, ఫకీర్పురం, సుంకిశాల, ముష్టిపల్లి గ్రామాఓ్ల బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాల్వాయి స్రవంతితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పలు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా హారతులు, బోనాలు, కోలాటాలు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ తనను దీవించి గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానన్నారు . గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మునుగోడు నియోజకవర్గంలో లక్ష్మణాపురం, చెర్లగూడెం ప్రాజెక్టులు పూర్తయితే మునుగోడు సస్యశ్యామల అవుతుందన్నారు. గతంలో ఎమ్మెల్యే , ఎంపీ ,ఎమ్మెల్సీగా చేసిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో ఒక రూపాయి పనైనా చేయలేదన్నారు.
కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుమ్మడ నర్సింహారావు , ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు సపావత్ సర్దార్ నాయక్, కారింగ్ హాలియా నర్సింహ, అందుగుల కవిత యాదయ్య, బాషపాక రాములు ,తుమ్మలూరి శ్రీరామ్ రెడ్డి, నాగులవంచ శ్రీలత, బల్గూరి విష్ణువర్ధన్, బోయపల్లి చంద్రయ్య దాసరి తిరుమలేశ్ ,వీరమల్ల భిక్షం, బత్తుల విజయ్ ,రామచంద్రం ,రమావత్ రవి నాయక్ పాల్గొన్నారు.