చిట్యాల, నవంబర్ 24 : ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో ధర్మం వైపు నిలబడండి, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి మద్దతు తెలిపి మరింత అభివృద్ధ్ది జరిగేలా చూడండి అంటూ బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రజలను కోరారు. శుక్రవారం ఆయన మండలంలోని గుమ్మళ్లబావి, శ్యామతోట బావి, చిట్యాల మున్సిపాలిటీలోని 10, 11,12వ వార్డుల్లో సుంకెనపల్లి, ఏపూరు గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి నియోజకవర్గానికి వందల కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధ్ది చేసినట్లు వివరించారు.
సాగు నీటి సమస్య పరిష్కారం కోసం ఉదయసముద్రం ప్రాజెక్టు ట్రయల్ రన్ చేశామని త్వరలోనే పూర్తి స్థాయిలో ఆ ప్రా జెక్టు ద్వార సాగునీరందుతుందని, అలాగే పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల ద్వారా కూడ శాశ్వతంగా సాగునీరందుతుందని చిరుమర్తి వివరించారు. మరోసారి బీఆర్ఎస్కే ప్రజలు పట్టం కడితే మరిన్ని సంక్షేమ పథకాలు అమ లవుతాయని అన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, ప్రసన్నరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మెండె సైదులు, కౌన్సిలర్లు శేపూరి రవీందర్, గోధుమగడ్డ పద్మాజలంధర్రెడ్డి, పందిరి గీతారమేశ్, జిట్ట పద్మాబొందయ్య, డీసీసీ బీ వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్రెడి , కోఆప్షన్ సభ్యుడు పాటి మాధవరెడ్డి, కర్నాటి ఉప్పలవెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య,కూనూరు సంజయ్దాసు, గుండెబోయిన సైదులు, పోలేపల్లి సత్యనారాయణ, చిత్రగంటి ప్రవీణ్, కొల్లోజు శ్రీనివాసు, మేడి ఉపేందర్ పాల్గొన్నారు.
చిట్యాలలోఎమ్మెల్యే చిరుమర్తి ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించారు. పింఛన్ ఇస్తూ పెద్ద కొడుకులాగా ఆదుకుంటున్న కేసీఆర్ సారు కారు గుర్తు మీదనే ఓటే వేస్తామని వృద్ధులు ఈ సందర్భంగా చిరుమర్తికి మాట
రామన్నపేట: అన్ని రంగాల అభివృద్ధితోపాటు సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనని ఆ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో కండ్ల ముందు జరిగిన అభివృద్ధిని, అందుతున్న సంక్షేమాన్ని చూసి కారుగుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. అనేక సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. 3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్‌తో కష్టాలు తప్పవని, కారుకు గుర్తుకు ఓటేసి అభివృద్ధిని కొన సాగించాలని కోరారు.
.కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, ప్రసన్నరాజ్, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, సర్పంచ్ అప్పం లక్ష్మీనర్సు, ఉసపర్పంచ్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, వెల్లంకి సర్పంచ్ ఎడ్ల మహేందర్‌రెడ్డి, గ్రామశాఖ అ ధ్యక్షుడు బండ శ్రీనివాస్‌రెడ్డి, కూనూరు ముత్తయ్య, పాల్గొన్నారు.
మండలకేంద్రంలోని మసీదుల వద్ద ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముస్లిం నాయకులను కలిసి వారిని కారు గుర్తుపై ఓటువేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. దీనికి వారంతా సంపూర్ణ మద్దతును ప్రకటించారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు మీర్జా ఇనాయత్బేగ్, ఈద్గా కమిటీ చైర్మన్ ఎంఏ వాహెద్, మీర్జా బషీర్‌బేగ్, నజీర్‌బేగ్, ఎస్కే చాంద్, మన్సూర్‌అలీ, ఎండీ బాసిత్, కరీం పాల్గొన్నారు.