పెన్పహాడ్, అక్టోబర్ 06 : బీఆర్ఎస్ నాయకుడు, పెన్పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామానికి చెందిన దొంగరి ప్రసన్నకుమార్ (52) అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. మృతదేహాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మునగాల మాజీ జడ్పీటీసీ సుంకరి అజయ్ కుమార్, మండలాధ్యక్షుడు దొంగరి యుగంధర్ సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీకి ప్రసన్న కుమార్ చేసిన సేవలను కొనియాడారు. సంతాపం తెలిపిన వారిలో మాజీ సర్పంచులు దొంగరి సుధాకర్, మేకల శ్రీనివాస్, చెన్ను శ్రీనివాస్ రెడ్డి, నరేందర్, శ్రీరాములు, నాయకులు వలిశెట్టి సత్యనారాయణ, దొంగరి విజయకుమార్, కిశోర్, శ్రీరామ్, సత్యనారాయణ, శోభ, దొంగరి అశోక్ ఉన్నారు. ప్రసన్న కుమార్కు భార్య స్వప్న, కుమారుడు మణి, కుమార్తెలు ప్రవళిక, ప్రాస్విని ఉన్నారు.