నల్లగొండ : ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందాలి అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణములో అయ్యప్ప స్వామి సేవా సదన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రవీంద్ర కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని అయన తెలిపారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, మకాం చంద్రమౌళి, బొడ్డుపల్లి కృష్ణ, మాడం రాములు, నల్లగాసు సత్యనారాయణ, పగిడిమర్రి సతీష్, చేరుపల్లి జయలక్ష్మి, జనీబాబ, వాజిద్ టీ, వడత్య బాలు, పాత్లవత్ లక్ష్మణ్, వడత్య గణేష్, రాజు, మణి, తదితరులు ఉన్నారు.