కట్క వేస్తే వచ్చే కరెంట్ కావాలా.. కర్ణాటక చీకట్లు కావాలా?
కాంగ్రెస్ పార్టీ అంటే నయవంచనకు మారుపేరు అని, అరవయ్యేండ్ల పాలనలో ప్రజలకు కన్నీళ్లే మిగిల్చిందని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. రాజాపేట మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- కాంగ్రెస్ మాటలు నమ్మితే ఆగమైతం
- మానవీయ పాలనకు నిదర్శనం కేసీఆర్ సర్కార్
- మరింత అభివృద్ధికి మరోసారి ఆశీర్వదించండి
- రాజాపేట మండలంలో బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ప్రచారం
కాంగ్రెస్ పార్టీ అంటే నయవంచనకు మారుపేరు అని, అరవయ్యేండ్ల పాలనలో ప్రజలకు కన్నీళ్లే మిగిల్చిందని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. రాజాపేట మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ నాడు దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ పథకాలు మోసమని, కట్క వేస్తే వచ్చే కరెంట్ కావాలా.. కర్ణాటక చీకట్లు కావాలా? ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
రాజాపేట, నవంబర్ 23 : అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కోరారు. గురువారం మండలంలోని కాల్వపల్లి, బసంతాపురం, నెమిల, పారుపల్లి, బూర్గుపల్లి, బొందుగుల, దూదివెంకటాపురం, లక్ష్మక్కపల్లి, సోమారం, పారుపల్లి, బూర్గుపల్లి, కుర్రారం, జాల, కొత్తజాల, సింగారంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తొమిదేండ్లలో చేసిన అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను వివరించారు. రూ.5వేల కోట్లతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. కాంగ్రెస్ అంటే మోసం, నయవంచనకు పెట్టింది పేరని, అలాంటి పార్టీకి ఓటేసి కష్టాలను కొనితెచ్చుకోవదన్నారు.
తెలంగాణ వస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని విమర్శలు చేసిన నాయకులకు నేడు కరెంట్ తీగలు పట్టుకునే దైర్ఘ్యం ఉందా అని ప్రశ్నించారు. ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం తాగు జలాలు అందించిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కట్క వేస్తే వచ్చే కరెంట్ కావాలా.. కర్ణాటక చీకట్లు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. నాటి పాలకులు దండుగ అన్న వ్యవసాయం నేడు రాష్ట్రంలో పండుగలా మారిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రైతులు సంతోషంగా జీవిస్తున్నారని చెప్పారు. రైతులు అప్పుల కోసం చేయి చాపొద్దని సీఎం కేసీఆర్ రైతు బంధు తీసుకొచ్చి అండగా నిలిచాడరన్నారు. కారు రావాలే, సీఎం కేసీఆర్ సారు రావాలే అప్పుడే రాష్టంలో మానవనీయ పాలన కొనసాగుతుందన్నారు. ఆలేరులో ముచ్చటగా మూడవసారి అఖండ మేజార్టీతో గులాబీ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రచారంలో డప్పు చప్పులతో గ్రామాలు గులాబీమయంగా మారాయి. మహిళలు మంగళహారతులతో గొంగిడి సునీతకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కల్లూరి రాంచంద్రారెడ్డి, పల్లెపాటి సత్యనారాయణ, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మోత్కుపల్లి జ్యోతీప్రవీణ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి, మహిళాధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్, సీసీ బ్యాంక్ చైర్మన్ చింతలపూరి భాస్కర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ జెల్ల భిక్షపతిగౌడ్, మదర్ డెయిరీ డైరెక్టర్లు గొల్లపల్లి రాంరెడ్డి,
చింతలపూరి వెంకట్రాంరెడ్డి, సర్పంచులు గుంటి మధుసూదన్‌రెడ్డి, ఠాకూర్ ధర్మేందర్‌సింగ్, వస్పరి ధనలక్ష్మీవిష్ణు, మెండు వెంకట్‌రెడ్డి, ఎడ్ల స్వరూపారాంచంద్రారెడ్డి, కర్ల కరుణాకర్‌రెడ్డి, ఎంపీటీసీ రాపోలు కవితాతిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ సందిల భాస్కర్‌గౌడ్, పాండవుల భానుపక్రాశ్గౌడ్, మెండు సత్తిరెడ్డి, సట్టు తిరుమలేశ్, గిరిరాజు వెంకటయ్య, మర్ల నాగరాజు, ఎర్రగోకుల జశ్వంత్, శివరాములు, ఉప్పలయ్యగౌడ్, సంగి ఉపేందర్, యాకుబ్, శ్రీనాథ్, ఎర్రగోకుల రాజు, గంధమల్ల సురేశ్, మహిపాల్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

