చౌటుప్పల్రూరల్, మే19 : బయోడిగ్రేబుల్ ఉత్పత్తులను ప్రోత్సహించాలని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ఓవెన్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం పరిధిలోని గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కులోని రమణి ఇండస్ట్రీస్ బయో కంపోస్టికా ఉత్పత్తులను సోమవారం ఆయన పరిశీలించారు. భూమిలో త్వరగా కరిగిపోయే బయోకంపోస్టికాతో క్యారీ బ్యాగులు తయారీ, పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండే విధంగా వస్తు ఉత్పత్తి వ్యాపారం చేయడం హర్షణీయమన్నారు.
మొక్కజొన్న పొట్టుతో తయారయ్యే గ్రాన్యూల్స్తో చేసే బ్యాగులు 90 రోజుల్లో భూమిలో కలిసి పోతాయని కంపెనీ యాజమాని రమణి ఆయనకు వివరించారు. టిఫ్ మేనేజర్ శ్రీకాంత్ హరిత పారిశ్రామిక పార్కు ప్రగతిని వివరించారు.