తొర్రూరు, ఫిబ్రవరి 15: కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసే అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రజలను కోరారు. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు. తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను 9 వా ర్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని, వీరిలో ఇద్దరు కాంగ్రెస్‌లో చేరినట్టు ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్స్అఫీషియో ఓట్లపై కూడా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని అన్నారు. గతంలో ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఓటు హకు వినియోగించుకునే అ వకాశం ఉండేదని, అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ తొర్రూరులో ఎక్స్అఫీషియో ఓటును వినియోగించకుండా అడ్డుకుంటున్నదని ఆరోపించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు అవకాశం లేకుండా కా ంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు ఎంపీ కడియం కావ్య ఎక్స్అఫీషియో ఓటును వరంగల్‌లో నమోదు చేసుకోగా, దానిని తిరస్కరించి తొర్రూరులో నమోదు చేసుకున్నదని దుష్ప్రచారం జరుగుతున్నదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా దుష్ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు.