రామగిరి, ఏప్రిల్ 22 : బ్రహ్మంగారి గుట్ట నల్లగొండ బూరుగు వృక్షంలో వెలసిన శ్రీ శ్రీ మద్దిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలను ఈ నెల 26న అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించాలని విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్లగొండ సంకల్పించింది. ఈ సందర్భంగా సేవా సంస్థ అధ్యక్షుడు దాసోజు యాదగిరి మాట్లాడుతూ.. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 400 సంవత్సరాల క్రితం బోధించిన కాలజ్ఞానం తత్వాలను నేడు ఒక్కక్క ప్రభోధం నిజ స్వరూపంగా జరుగుతున్నాయన్నారు. అలాంటి మహనీయులన్నీ ఆధారంగా ఉత్సవాలను జాతీయలంతా కలిసి వైభవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి పెందోట సోము మాట్లాడుతూ.. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం బోధనలను పూర్తి స్థాయిలో ప్రచారం చేయాలన్నారు. ఆయన రాసిన కాలజ్ఞాన బోధనలు భక్తులoదరికి తెలియజేయాలన్నారు. కాలజ్ఞానంలోచెప్పిన తత్వాలు నేడు నిజ స్వరూపంగా మారుతున్నాయన్నారు. ధర్మాన్ని వీడి ధనం కోసం పాకులాడుతున్నారన్నారు. ప్రపంచ దేశాల్లో కల్లోలం జరుగుతుందని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు 400 సంవత్సరాల క్రితమే పేర్కొన్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వబ్రాహ్మణ అధ్యక్షుడు కొల్లోజు సత్యనారాయణ చారి, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు రాచకొండగిరి, లయన్స్ క్లబ్ గోల్డ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు దాసోజు శ్రీనివాస్, విశ్వబ్రాహ్మణ నాయకులు కొండోజు కృష్ణ చారి, శ్రీపాద కృష్ణమాచారి, పర్వతం నరేంద్రబాబు, తరునోజు భీష్మాచార్య, పోలోజు శ్రీనివాస చారి, పెరికేటి వెంకటాచారి, రాగి ఫణి విష్ణుమూర్తి, విశ్వనాధుల రవి, మహేశ్వరం బ్రహ్మచారి, పగిదోజు ఆచారి, కటకం వెంకటాచారి, దేవులపల్లి వెంకటాచారి పాల్గొన్నారు.