నల్లగొండ, ఆగస్టు 28 : బ్రహ్మకుమారీస్ సేవలు అభినందనీయం అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నల్లగొండలోని క్యాంప్ కార్యాలయంలో మండలి చైర్మన్కు బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో సోదరభావం, ప్రేమ, శాంతి, పరస్పర గౌరవం మరింత పెంపొందాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతి, ఆధ్యాత్మిక విలువలు, మానవతా భావాన్ని పెంపొందించేందుకు బ్రహ్మకుమారీస్ చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.