నీలగిరి, ఆగస్టు 21 : నల్లగొండలోని ఎస్సీ హాస్టల్ లో ఉంటూ 6వ తరగతి చదువుతున్న ఓ బాలుడు ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ పోయేందుకు బస్సు ఎక్కాడు. బాలుడి మిస్సింగ్‌పై 112 కాల్ ద్వారా సమాచారం అందుకున్న నల్లగొండ రూరల్ ఎస్ఐ శివ ప్రసాద్, కానిస్టేబుల్స్ రమేశ్, అనిల్, హోంగార్డ్ వెంకన్న తక్షణమే స్పందించారు. నల్లగొండ పట్టణంలోని ఐటీ టవర్ వద్ద బస్సు అపి బాలుడిని గుర్తించి సంరక్షించారు. విచారణ చేయగా డిండి మండలం గోనబోయినపల్లి గ్రామం బలుపాటి బాలుగా గుర్తించారు. చదువుకోవడం ఇష్టం లేకనే హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పాడు. వెంటనే 1098 ద్వారా పిల్లల సంరక్షణ వారికి సమాచారం ఇచ్చి వారి ద్వారా బాలుడిని తల్లిదండ్రులకి అప్పజెప్పారు.