కట్టంగూర్, నవంబర్ 13 : హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 19న కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి వర్ధంతి సందర్భంగా నిర్వహించే పుస్తకావిష్కరణ సభను విజయవంతం చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నల్లగొండ జిల్లా నాయకుడు గజ్జి రవి పిలుపునిచ్చారు. గురువారం కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి సభా పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి భూమి, భుక్తి, దేశ విముక్తి, అణగారిన వర్గాల కోసం ఉన్నత చదువులు వదిలిపెట్టి విప్లవోద్యంలో పని చేశారని కొనియాడారు.
కార్యక్రమానికి ముఖ్య వ్యక్తలుగా కేంద్ర, రాష్ట్ర కమిటీ నాయకులు వీకే. పటోలే, వేములపల్లి వెంకటరామయ్య, సాదినేని వెంకటేశ్వరరావు, పి.ప్రసాద్, జేవి. చలపతిరావు, ప్రదీప్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, మధు, శ్రీనివాస్, సుధాకర్, సంధ్య, గోవర్ధన్, ఝూన్సీ హాజరవుతున్నారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బూరుగు సత్యనారాయణ, గంగబోయిన వీరాంజనేయులు, గోదల పురుషోత్తంరెడ్డి, యాదగిలరెడ్డి, గజ్జి మల్లయ్య, అంజయ్య, భిక్షం, లింగయ్య, యాదగిరి పాల్గొన్నారు.