రామగిరి, నవంబర్ 15 : పుస్తకం హస్త భూషణం అని, పుస్తకం చదవడం ద్వారా కలిగే ప్రత్యక్ష అనుభవం ఎంతో అనుభూతిని ఇస్తుందని నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్ అన్నారు. 58వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సరస్వతి చిత్రపటానికి పూలమాల వేసి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి వస్తువు, ప్రతి పుస్తకం విలువైనదని, గ్రంథాలయాన్ని అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాఠకులకు ఏ విధమైన పుస్తకాలు కావాలన్నా తనను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. గ్రంథాలయానికి ఇంటర్ నెట్, వై ఫై సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు.
జిల్లా ఉపాధి కల్పనా అధికారి ఎన్.పద్మ మాట్లాడుతూ.. పుస్తకాలు చదవడం వల్ల మన జ్ఞానం పెంపొందుతుందన్నారు. ప్రపంచ చరిత్ర, సాహిత్యం, సంస్కృతి తెలుసుకునేందుకు పుస్తకాలు ఎంతగానో దోహద పడుతాయన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.బాలమ్మ మాట్లాడుతూ.. లైబ్రరీ అభివృద్ధికి అన్నివిధాల కృషి చేస్తానని తెలిపారు. విద్యా, వైజ్ఞానిక పుస్తకాలను పాఠకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గాదె వినోద్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర నాయకుడు ఎస్.వేణుగోపాలాచార్యులు, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.

Ramagiri : పుస్తకం హస్త భూషణం : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్

Ramagiri : పుస్తకం హస్త భూషణం : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్