రామగిరి, ఆగస్టు 02 : సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించేలా శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని బీఈడీ శిక్షణలో భాగంగా శనివారం నల్లగొండలోని డైట్ ప్రాంగణంలో గల ప్రభుత్వ విద్యా శిక్షణ కళాశాల-బీఈడీలో బోనాల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఛాత్రోపాధ్యాయులు పోతరాజుల విన్యాసాలు, డప్పుచప్పులతో డైట్ ప్రాంగణంలోని బీఈడీ కళాశాల నుండి బీటీఎస్ వరకు బోనాలను తీశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ.. బీఈడీ కరిక్యూలం రెండవ సెమిస్టర్ లో ఆర్ట్ ఇన్ ఎడ్యూకేషన్ సబ్జెక్టులో భాగంగా సంస్కృతి సాంప్రదాయాలను నేటితరం విద్యార్థుల్లో ప్రతిబింబించేలా బోనాల కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, అయితే ఉపాధ్యాయులకు బోధన విధానంతో పాటు కో కరిక్యూలం యాక్టివిటీలో భాగంగా సాంస్కృతి సాంప్రదాయాలను బీఈడీ శిక్షణ విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో బోనాల ఉత్సవాన్ని నిర్వహించినట్లు చెప్పారు.
బోనాల మహోత్సవం నిర్వహించిన ఛాత్రోపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులను కళాశాల పూర్తి అదనపు బాధ్యతల ప్రిన్సిపాల్, డీఈఓ బొల్లారం భిక్షపతి అభినందించారు. కళాశాల పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అధ్యాపకుడు పేర్ల జికేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల పరిపాలన అధికారి సి.రాఘవేందర్, సీనియర్ అధ్యాపకులు సీహెచ్.వెంకటరామిరెడ్డి, బొడ్డుపల్లి రామకృష్ణ, డాక్టర్ సుభాషిని, ఫాతిమా, రఫీ, శ్రీధర్ రెడ్డి, సాదియా పరిహీన్, ఇ.దేవేంద్ర, అనిల్ కుమార్, గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు సైదులు, ఫిజికల్ డైరెక్టర్ నరేశ్, ఐసీటీ అధ్యాపకుడు మహమ్మద్ సమీ, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కె.క్రాంతికుమార్ రెడ్డి, కె.శశికళ, జూనియర్ అసిస్టెంట్లు డి.రేణుక, కె.మల్లికార్జున్, సిబ్బంది వెంకటేశ్వర్లు, అస్మద్దీన్, జంగయ్య, బీఈడీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు.
Nalgonda : నల్లగొండ ప్రభుత్వ బీఈడీ కళాశాలలో వైభవంగా బోనాలు
Nalgonda : నల్లగొండ ప్రభుత్వ బీఈడీ కళాశాలలో వైభవంగా బోనాలు