నిడమనూరు, ఆగస్టు 19 : నిడమనూరు మండల కేంద్రంలో బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరుపుకున్నారు. శ్రావణమాసం సందర్భంగా మంగళవారం గ్రామ దేవత ముత్యాలమ్మకు సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మేళ తాళాలు, శివసత్తుల నృత్యాల నడుమ బోనాలతో ఊరేగింపుగా బయల్దేరి బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ దేవత ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ముత్యాలమ్మ ఆలయం, బొడ్రాయి, పోతురాజుల వద్ద యాటలను బలిచ్చారు. బుధవారం గ్రామంలో వన భోజనాల కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ శేషరాజు లక్ష్మీ నరేశ్ దాసు, బొల్లం సైదులు, కోమటి వెంకన్న, పిల్లి రాజు యాదవ్, పోలేపల్లి యాదగిరి, కుంచం సతీశ్, బొజ్జ పుల్లయ్య, మాచర్ల దాసు, కొండోజు కృష్ణాచారి, మెరుగు మధు, శేషరాజు శ్రీనివాస్, ఉన్నం ఈశ్వర్ ప్రసాద్, ఉన్నం ఉషా కిరణ్, కోలా శ్యాం, పగిళ్ల నాగయ్య, కల్లు పురుషోత్తం రెడ్డి, అనుముల శంకర్ పాల్గొన్నారు.