మునుగోడ, మార్చి 26 : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ధర్మబిక్షం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ పోలగోని సత్యం అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో దివంగత మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం వర్ధంతిని మండల గౌడ సంఘం, సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన బస్టాండ్ వద్ద ఉన్న ధర్మభిక్షం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లుగా ఎంపీగా పనిచేసిన ధర్మభిక్షం చట్టసభలో పీడిత ప్రజల గొంతుకై వినిపించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జాజుల అంజయ్య గౌడ్, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, వివిధ పార్టీల నాయకులు పాలకూరి యాదయ్య గౌడ్, నకరేకంటి యాదయ్య గౌడ్, మాదగోని రాజేశ్ గౌడ్, పొలగోని సైదులు, దేశిడి యాదయ్య గౌడ్, మారగోని అంజయ్య, జాజుల స్వామి గౌడ్, పంతంగి స్వామి, గజ్జెల బాలరాజు, బి.లాలు,దుబ్బ వెంకన్న, బండారు శంకర్, గోపగోని పాపయ్య, కట్కూరు లింగస్వామి, అంజి పాల్గొన్నారు.