తుంగతుర్తి, జూన్ 04 : కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ద్వారా ప్రత్యేక ఓట్ల జాబితా సవరణ చేపట్టిందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బూత్ ఏజెంట్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 25 నుండి గ్రామాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఎన్నికల బూత్ లెవెల్ అధికారులు ఓటర్ల సవరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే గృహాలకు సంబంధించిన ఎన్యూమరేషన్ పూర్తి కావస్తుందని, ఓటరు కుటుంబ వివరాలను అందులో నమోదు చేసి బీఏఓకు అందచేయాలని అధికారులు చెబుతున్నట్లు వెల్లడించారు. అందుకోసం రాజకీయ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
త్వరలో బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వాన్ని చేర్పించే కార్యక్రమానికి రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు జారి చేసినట్లు తెలిపారు. సభ్యత్వం చేయించడానికి ఇప్పటికే ప్రతి బూత్‌కు ఇద్దరు కార్యకర్తలను ఎంపిక చేసి రాష్ట్ర పార్టీకి పంపడం జరిగిందని త్వరలో జిల్లా స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, సర్పంచులు కుంచాల శ్రీనివాసరెడ్డి, రమేశ్. కొండగడుపుల ఎల్లయ్య, వెంకటమ్మ కరుణాకర్, బూత్ ఏజెంట్లు, నాయకులు పాల్గొన్నారు.