కొండమల్లేపల్లి, నవంబర్ 19 : కొండమల్లేపల్లి మండల పరిధిలో గల చెన్నారం గేటు వద్ద దేవరకొండ ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం వాహనాల తనిఖీ చేపట్టారు. చెన్నారం గేట్ నుండి కొండమల్లేపల్లికి వెళ్లే రోడ్డు మార్గంలో వెళ్తున్న అశోక్ లేలాండ్ మినీ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. దీంతో 1,800 కేజీల నల్ల బెల్లం, 80 కేజీల పట్టికను గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని దేవరకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్ఐ నరసింహ, వీరబాబు, కానిస్టేబుల్ కృష్ణ పాల్గొన్నారు.