గట్టుప్పల్, ఆగస్టు 28 : గట్టుప్పల్ మండల పరిధిలోని అంతంపేట గ్రామంలో ఉన్న బీటీ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారవడంతో బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు గురువారం రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరును ఎండగట్టారు. అభివృద్ధిని మరిచి, స్వలాభం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మండిపడ్డారు. ఇకనైనా కళ్లు తెరిచి గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి గట్టుప్పల మండలాధ్యక్షుడు రావుల ఎల్లప్ప, నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు కంపే దుర్గయ్య, మాజీ సభ్యుడు చిలువేరు దుర్గయ్య, మండల ప్రధాన కార్యదర్శి విడం రాజు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు వీరమళ్ల రాజు గౌడ్, శ్రీనివాస్, జంపాల సుధాకర్, శ్రీను, భిక్షం గౌడ్, నరసింహ, భాస్కర్, రాజు గౌడ్, లింగయ్య, శంకర్, యాదయ్య పాల్గొన్నారు.