చండూరు, అక్టోబర్ 24 : చండూరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రికి 2 ఎకరాల భూమిని దానంగా ఇచ్చిన భూతరాజు రామయ్య 44వ వర్ధంతిని శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా రామయ్య కుటుంబ సభ్యులు, ఆస్పత్రి సిబ్బంది ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామయ్య మనవడు మురళి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు మెరుగైన వైద్యం అందాలనే ఆకాంక్షించి నాడు తమ తాత ఆస్పత్రికి స్థలాన్ని బహూకరించినట్లు తెలిపాడు. ఆస్పత్రి ఉన్నంత కాలం ఆయన పేరు చిరస్మరణీయంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాస రాజు, వెంకటేశం, యాదయ్య, రమేశ్, హేహన్ష్, రామకృష్ణ, సునీత, స్రవంతి, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.