దేవరకొండ రూరల్, ఆగస్టు 16 : దేవరకొండ మండలం మర్రిచెట్టుతండాలో శనివారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎంపీడీఓ డ్యానియల్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ సకాలంలో ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మైనంపల్లి మాజీ ఎంపీటీసీ, యూవజన కాంగ్రెస్ రాష్ట్ర నేత కొర్ర రాంసింగ్ నాయక్, సీత్య నాయక్, మాజీ సర్పంచ్ శ్రీను నాయక్, మాజీ ఉప సర్పంచ్ చిన్న నాయక్, పంచాయతీ కార్యదర్శి కీర్తి, కిషన్, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.