కోదాడ, ఆగస్టు 07 : అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఆయిల్ సూర్యాపేట, ఖమ్మం జిల్లాల సేల్స్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కోదాడ మండల పరిధిలోని గుడిబండ శివారులో అంజన్ ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద గురువారం అగ్నిప్రమాద నియంత్రణకు డెమో ఏర్పాటు నిర్వహించారు. ఇండియన్ ఆయిల్ టయప్ కంపెనీ బ్రాండ్స్ డాడీ రూపొందించిన ఆటో ఫెయిర్ ఎస్టింగ్ మిషన్ ప్రతి గృహంలో అమర్చుకోవాలని సూచించారు. విద్యుత్, గ్యాస్, ఇతర అగ్ని ప్రమాదాలను ఈ యంత్రం నియంత్రిస్తుందని తెలిపారు. యంత్రం క్క ప్రయోజనాలను గ్రామస్తులకు వివరించారు. అనంతరం డెమో చూపించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ సేల్స్ ఆఫీసర్ సంపత్ కుమార్, కంపెనీ ప్రతినిధులు శైలేష్, దీపిక, అంజన్ గౌడ్, రాజశేఖర్, శ్యామ్ పాల్గొన్నారు.