సూర్యాపేట, ఫిబ్రవరి 20 : బీపీ, షుగర్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మానసిక ఒత్తిడికి లోను కాకుండా రోజూ వ్యాయా మం, ధాన్యం చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. సోమవారం పట్టణంలోని గిరినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన రోగులకు ఎన్సీడీ కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 82 వేల మందికి ఎన్సీడీ కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రజలు క్రమం తప్పకుండా 30 నిమిషాల పాటు వ్యాయా మం, ధాన్యం, ప్రాణాయామం వంటివి చేయాలన్నారు. ప్రతి నెల ఆరోగ్య కార్యకర్తల వద్ద ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. బీపీ, షుగర్ అదుపులో ఉంచుకోవడం వలన వాటి వలన కలిగే దుష్ఫలితాలకు దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణాధికారి డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ వర్మ, ఎన్సీడీ కోఆర్డినేటర్ సైదులు పాల్గొన్నారు.
అసంక్రమిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
తిరుమలగిరి : ప్రజలు అసంక్రమిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ వైస్ చైర్మన్ రఘునందన్‌రెడ్డి అన్నారు. సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో షుగర్, బీపీ వ్యాధుల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం అవసరమైన వారికి ఎన్సీడీ కిట్లను పంపిణీ చేశారు. వైద్యుల సూచనలతో అసంక్రమిత వ్యాధులను నియంత్రించుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వందన, సీహెచ్ఓ బిచ్చూనాయక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు