కేతేపల్లి, నవంబర్ 27 : ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటిస్, గుండెపోటు వంటి వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం అన్నారు. ప్రా ణాంతక వ్యాధులపై అవగాహన కోసం ప్రముఖ సంగీత దర్శకుడు శశిప్రీతమ్ ఆధ్వర్యంలో లయన్స్క్లబ్, రోటరీ క్లబ్ సహకారంతో నిర్వహిస్తున్న అవగాహన బైక్ ర్యాలీ ఆదివారం మండ లానికి చేరుకుంది. ఉప్పలపహాడ్ వద్ద లిటిల్ విలేజ్ హోటల్లో సమావేశమయ్యారు. సమావేశంలో డీఎస్పీ పాల్గొని మాట్లాడుతూ ప్రాణాంతకమైన వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించాలన్నారు.
గ్రామీణ ప్రజలను చైత న్యం చేయాలని నిర్వాహకులకు సూచించారు. సంగీత దర్శకుడు శశిప్రీతమ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ప్రైవేటు ఆసుపత్రుల సహకారంతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తామన్నారు. ర్యాలీని నిజామాబాద్ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో బిగ్బాస్ ఫేమ్ శ్వేతావర్మ, సింగరాజు క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మల్లిక్ సింగరాజు, ప్రముఖ సైకాలజిస్టులు ఐశ్వర్య, కృష్ణప్రియ, మలినేని విద్యాసంస్థల నిర్వాహకుడు డాక్టర్ పెరుమాళ్, లయన్స్, రోటరీ క్లబ్ నిర్వాహకులు, పలువురు వైద్య ప్రముఖులు పాల్గొన్నారు.