Kodada : బట్టు శ్రీహరి నీకిది తగునా ?
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థినులకు ఉచిత చదువుతో పాటు ఉచిత హాస్టల్ వసతి, నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్న "కిట్స్" మహిళా ఇంజినీరింగ్ కళాశాలను అబాసు పాలు చేసేందుకు ఓయూ జేఏసీ నేతగా ప్రధాన భూమిక పోషించిన బట్టు శ్రీహరి కుట్ర పన్నడం సముచితం కాదని లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి కోటియానాయక్ అన్నారు.
– మన జాతి పిల్లలు ఉచితంగా చదువుకునే కళాశాలపై అపవాదులేల
– పద్ధతి మార్చుకోకపోతే ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం
– ఎల్‌హెచ్‌పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోటియానాయక్
కోదాడ, సెప్టెంబర్ 04 : ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థినులకు ఉచిత చదువుతో పాటు ఉచిత హాస్టల్ వసతి, నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్న “కిట్స్” మహిళా ఇంజినీరింగ్ కళాశాలను అబాసు పాలు చేసేందుకు ఓయూ జేఏసీ నేతగా ప్రధాన భూమిక పోషించిన బట్టు శ్రీహరి కుట్ర పన్నడం సముచితం కాదని లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి కోటియానాయక్ అన్నారు. గురువారం కోదాడలో ఆయన ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత రెండు దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల బాలికలకు సాంకేతిక విద్య అందించడంతో పాటు వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థపై ప్రతి విద్యా సంవత్సరం అడ్మిషన్ల సమయంలో కొంతమంది కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని, వారికి శ్రీహరి వత్తాసు పలకడాన్ని తీవ్రంగా ఖండించారు.
కళాశాలను అన్ని రకాల అనుమతులతో సజావుగా నడిపిస్తున్న యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. ఈ నెల 1న హైదరాబాద్‌లో ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన కళాశాల యాజమాన్యాన్ని అడ్డుకోవడంతో పాటు వారి నుంచి ఫైళ్లు లాక్కోవడాన్ని ఎల్హచ్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తప్పుడు విధానాలు మానుకోకపోతే సంఘం ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. ఇప్పటికే కళాశాలపై బనాయించిన అక్రమ కేసులు కోర్టులో కొట్టివేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలపై పనిగట్టుకుని తప్పుడు ఆరోపణలు చేయవద్దని సూచించారు.
ప్రతి విద్యా సంవత్సరం కన్వీనర్ కోటాలో 100 శాతం సీట్లు భర్తీ అయ్యే కళాశాలపై అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు. ఇంజినీరింగ్ విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే ఆర్థిక పరిస్థితి లేని మన జాతి విద్యార్థినులకు కళాశాల మెరుగైన విద్యనందిస్తున్న విషయాన్ని గమనంలోకి తీసుకుని భవిష్యత్‌లో ఈ కళాశాలను బద్నాం చేయవద్దని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బర్మావత్ రాజు నాయక్, జిల్లా అధ్యక్షుడు భూక్య రవి నాయక్, ప్రధాన కార్యదర్శి నాగు నాయక్, నాగరాజు నాయక్, శీను నాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

