Basantapuram | రాజాపేట, మే 18 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బసంతాపురం గ్రామానికి చెందిన హనుమాన్ మాలాధారణ భక్తులు ఆదివారం కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండగట్టుకు మూడు రోజుల్లో చేరుకొని మాల వితరణ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే 22వ సారి హనుమాన్ మాలాధారణ ధరించి మూడోసారి కొండగట్టుకు పాదయాత్రగా వెళ్లినట్టు తెలిపారు. మండల ప్రజలు సుభిక్షంగా ఉండి పాడిపంటలు పండాలని మొక్కులో భాగంగా పాదయాత్రగా వెళ్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి రాపాక తిరుపతి కనకరాజు, పురుషోత్తం, గణేష్ ఉన్నారు.